Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

మరోసారి నాకౌట్‌లోకి ఫ్రాన్స్​- ఎంబాపె రికార్డ్​ గోల్స్​- ఇరాక్‌పై 3-0తో విజయం

Author Neti Sudiksha | 23 Jun 2026, 12:25 PM | NATIONAL
మరోసారి నాకౌట్‌లోకి ఫ్రాన్స్​- ఎంబాపె రికార్డ్​ గోల్స్​- ఇరాక్‌పై 3-0తో విజయం

ఫిఫా ప్రపంచకప్‌లో రెండు సార్లు ఛాంపియన్‌ అయిన ఫ్రాన్స్‌ మళ్లీ కప్పు కొట్టేందుకు దూసుకెళ్తోంది. స్టార్‌ ఆటగాడు కిలియన్‌ ఎంబాపె మరోసారి డబుల్‌ గోల్స్‌తో మెరవడంతో ఇరాక్‌పై ఈ జట్టు 3-0తో విజయం సాధించింది. ఫలితంగా నాకౌట్‌లోకి అడుగుపెట్టింది. ఫ్రాన్స్‌ తరఫున ఔస్‌మనె డెంబెలె మరో గోల్‌ చేశాడు.

అటు 27 ఏళ్ల ఎంబాపెకుఇది 100వ అంతర్జాతీయ మ్యాచ్‌. వర్షం కారణంగా ఆలస్యంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఎంబాపె 14, 54వ నిమిషాల వద్ద రెండు గోల్స్‌ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలోనే సరికొత్త ఘనత సాధించాడు. మూడోసారి ఫిఫా వరల్డ్‌కప్‌ ఆడుతున్న ఎంబాపె ఈ టోర్నీలో అత్యధిక గోల్స్‌ చేసిన రెండో ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. జర్మనీకి చెందిన మిరస్లావ్‌ క్లోజ్‌ (16) రికార్డును సమం చేశాడు.

సెనెగల్‌పై 3-2 తేడాతో నార్వే విజయం
ఫిఫా ప్రపంచ కప్​లో భాగంగా జరిగిన మరో మ్యాచ్​లో సెనెగల్‌పై 3-2 తేడాతో నార్వే విజయం సాధించింది. ఫలితంగా నార్వే రౌండ్ ఆఫ్ 32కు దూసుకెళ్లింది. హాలాండ్ తన అద్భుతమైన గోల్స్ పరంపరను 48, 58వ నిమిషాల్లో కొనసాగించి నార్వే గెలిచేలా చేశాడు. హాలాండ్ తన చివరి 12 అంతర్జాతీయ ఆటల్లో 24 గోల్స్ చేశాడు. ప్రతి మ్యాచ్‌లో కనీసం ఒక గోల్ సాధించాడు. మొత్తంగా 52 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 59 గోల్స్ చేశాడు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా, ఫిఫా వరల్డ్‌కప్‌ చరిత్రలోనే అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాడిగా అర్జెంటీనా స్టార్‌ ప్లేయర్‌ మెస్సి రికార్డు సృష్టించాడు. ఆస్ట్రియాపై జరిగిన మ్యాచ్‌లో మెస్సి రెండు గోల్స్‌ చేయడంతో అతడి మొత్తం గోల్స్‌ సంఖ్య 18కు చేరింది. ఈ టోర్నీలో అర్జెంటీనా తరఫున అయిదు గోల్స్‌ నమోదైతే అవన్నీ మెస్సి చేసినవే ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో అర్జెంటీనాకు అద్భుత విజయాన్ని అందించిన ఈ దిగ్గజ ఆటగాడు, ఆస్ట్రియాతో రెండో మ్యాచ్‌లో రెండు గోల్స్‌తో రెచ్చిపోయాడు. ఫలితంగా ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాడిగా మిరస్లావ్‌ క్లోజ్‌ (16) పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. 18 గోల్స్‌తో మెస్సి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటికే గ్రూప్‌-జెలో వరుసగా రెండు విజయాలతో అర్జెంటీనా నాకౌట్‌ బెర్తును ఖాయం చేసుకుంది.