Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

రవితేజ- మారుతి కాంబోలో మూవీ? అసలు నిజమెంత?

Author Neti Sudiksha | 24 Jun 2026, 01:02 PM | Cinema
రవితేజ- మారుతి కాంబోలో మూవీ? అసలు నిజమెంత?

మాస్ మహారాజా రవితేజ ఇటీవల ఆయన చేసిన సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దాంతో ఈ సారి ఎలాగైనా రవితేజ ఓ హిట్ కొట్టి గట్టి కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో రవితేజ డైరెక్టర్ మారుతి కాంబోలో ఓ మూవీ రానున్నాయనే రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. అయితే రవితేజ- మారుతి కాంబోలో సినిమా రూపొందనుందనే రూమర్​ చర్చనీయాంశంగా మారింది. దీని ప్రకారం రవితేజ మారుతి కాంబినేషన్​లో ఇరుముడి మూవీ పూర్తయిన వెంటనే ఇది పట్టాలెక్కనుందని జోరుగా ప్రచారం నడుస్తోంది. కానీ దీనిపై ఏ విధమైన అధికారిక సమాచారం లేదు.

కాంబినేషన్​పై భిన్నాభిప్రాయాలు
అయితే ఆ కాంబినేషన్​పై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కెరీర్​ పరంగా ఇరువురూ ప్లాప్స్​లో ఉన్నాయి. మారుతి ప్రభాస్​తో చేసిన రాజాసాబ్ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్​గా నిలిచింది. అంతేకాకుండా మారుతి ప్రీ రిలీజ్ ఈవెంట్​లో చేసిన కామెంట్స్​ వల్ల ఆయన ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. దీంతో వాటన్నింటికీ చెక్ పెడుతూ కొంత విరామం అనంతరం మరో మంచి ప్రాజెక్టుతో రెడీ అవుదామని భావిస్తున్నారు.


ఈ నేపథ్యంలో రవితేజ మారుతి కాంబోపై వచ్చిన రూమర్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇద్దరి కెరీర్ గాడిన పడాలంటే వీరికి ఒక హిట్ అత్యవసరం. దీనిపై పలువురు ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొద్దిమంది రవితేజ ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్​, ఫెర్ఫార్మెన్స్​కు మారుతి స్టైల్ ఆఫ్ కామెడీ తోడైతే అదిరిపోతుందని అంటున్నారు. మరికొంతమంది సరైన సమయంలో, వీరి కాంబినేషన్ అనేది సరైన నిర్ణయమని భావిస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఇది రూమర్​ స్టేజ్​లోనే ఉండటంతో క్లారిటీ లేదు. మారుతి, రవితేజ నుంచి మూవీ ప్రాజెక్టుపై అఫీషియల్ ఎనౌన్స్​మెంట్ వచ్చేవరకూ దీనిపై సస్పెన్స్ వీడేలా లేదు.

ఇవి కూడా చదవండి

ఎవరితో ముందు చేస్తారు!
అయితే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్​పై దర్శకుడు వివేక్ ఆత్రేయ, రవితేజ కలయికలో మరో చిత్రం రూపొందనుంది. అక్టోబర్​​లో మూవీ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తన స్టైల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్​తో ఆకట్టుకునే వివేక్ ఆత్రేయ, ఈ సినిమాను హర్రర్, యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించనున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. వివేక్ మొదట్లో ఈ స్టోరీని మరో స్టార్ హీరోతో చేయాలని ప్లాన్ చేయగా, చివరికి రవితేజకు వద్దకు చేరింది. కథ విన్న వెంటనే ఆయన ఓకే చేశారు. అయితే ఇప్పుడు మారుతి పేరు వినిపిస్తుండటంతో ముందు ఎవరితో చేస్తారనే దానిపై కూడా అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఇరుముడితో బిజీగా రవితేజ
రవితేజ ప్రస్తుతం ఇరుముడి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ శివనిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. ఈ మూవీ ఆగస్టు 21న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నట్లు తెలిపారు. తమిళంలో 'ఇరుముడికట్టు' పేరుతో రిలీజ్ కానుందని వెల్లడించారు.