Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

కారులో దారుణ ఘటన..

Author Neti Sudiksha | 26 Jun 2026, 12:39 PM | NATIONAL
కారులో దారుణ ఘటన..

మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో యువతి, యువకుడి మృతదేహాలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ నిర్మానుష్య ప్రదేశంలో పార్క్ చేసిన కారులో ఇద్దరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. యువకుడి తలకు బుల్లెట్, ముఖంపై కాలిన గాయాలు కనిపించాయి. మరోవైపు యువతి గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు కనిపిస్తోంది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వారిని రితిక్ సోని, ముస్కాన్‌గా పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా కారులో మారణాయుధాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అనంతరం పోలీసులు మాట్లాడుతూ.. బుధవారం మధ్యాహ్నం జిమ్‌ చేసేందుకు ముస్కాన్ ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. రాత్రి అయినా ఆమె ఇంటికి రాలేదని.. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు కోత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. మరోవైపు రితిక్ సుమారు 15 రోజుల కిందటే ఇండోర్ నుంచి అశోక్‌నగర్‌కు వచ్చారని పేర్కొన్నారు. యువతి కోసం గాలిస్తుండగా.. అశోక్‌నగర్ ప్రాంతంలో అనుమానాస్పదంగా పార్క్ చేసి ఉంచిన కారు కనిపించిందని తెలిపారు. దాన్ని పరిశీలించగా రెండు మృతదేహాలు కనిపించాయన్నారు. మృతులను రితిక్, ముస్కాన్‌గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. వెంటనే ఘటనాస్థలికి ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించి ఆధారాలు సేకరించినట్లు వివరించారు. వాహనం నుంచి ఓ తుపాకీ, రక్తపు మరకలతో ఉన్న గొడ్డలి, కట్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.