Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

తుది జట్టులోకి సూర్యవంశీ ఎంట్రీపై బ్యాటింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు..

Author Neti Sudiksha | 26 Jun 2026, 12:50 PM | Sports
తుది జట్టులోకి సూర్యవంశీ ఎంట్రీపై బ్యాటింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు..

టీమిండియాలో ప్రస్తుతం కుర్రాళ్ల హవా నడుస్తోంది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లు తమ దూకుడైన ఆటతీరుతో ఇప్పటికే జట్టుకు కొత్త ఊపు తీసుకువచ్చారు. తాజాగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంపిక క్రికెట్ అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో ప్రపంచస్థాయి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అలానే ఐపీఎల్ 2026లో ఏకంగా 776 పరుగులతో 'ఆరెంజ్ క్యాప్' కైవసం చేసుకున్న సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. ఈ నేపథ్యంలో ఐర్లాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌లో అతడిని బరిలోకి దించాలని అభిమానుల నుంచి గట్టి డిమాండ్ వినిపిస్తోంది.
అయితే, బెల్‌ఫాస్ట్‌లో తొలి మ్యాచ్‌కు ముందు టీమిండియా మేనేజ్‌మెంట్ సూర్యవంశీ ఎంట్రీపై స్పష్టమైన సంకేతాలిచ్చింది. అభిమానులను కొంత నిరాశకు గురిచేసినప్పటికీ జట్టు ప్రయోజనాల దృష్ట్యా మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని విశ్లేషకులు భావిస్తున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని మేనేజ్‌మెంట్ 'వ్యక్తుల కంటే జట్టే ముఖ్యం' అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతోంది.