Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

నీట్ పేపర్ లీక్‌పై కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన

Author Neti Sudiksha | 27 Jun 2026, 04:42 PM | వరంగల్
నీట్ పేపర్ లీక్‌పై కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన

మోదీ దిష్టిబొమ్మ దహనం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్

వరంగల్, జూన్ 27 (సుదీక్ష న్యూస్): రాహుల్ గాంధీ పిలుపు మేరకు వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్‌లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ, జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో “ఛాత్రోంకి గూంజ్” కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ వరుసగా పరీక్షల్లో పేపర్ లీక్‌లు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారాన్ని నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ అయూబ్ డిమాండ్ చేశారు.
అయూబ్ మాట్లాడుతూ, గతంలో ప్రమాదాలు లేదా వైఫల్యాలు జరిగినప్పుడు పలువురు మంత్రులు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారని, కానీ ప్రస్తుతం విద్యార్థులు, మహిళలు నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ బీజేపీ నాయకులు పదవులను అంటిపెట్టుకుని ఉండటం సిగ్గుచేటని విమర్శించారు.
జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేష్ మాట్లాడుతూ, యువత భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసి దేశ ప్రజలకు, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ రమేష్, గుండేటి నరేందర్, కరాటే ప్రభాకర్, గజ్జల లింగమూర్తి, జాను రవి తదితర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.