Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కంచ‌ర్ల భూపాల్‌రెడ్డి బహిరంగ లేఖ

Author Neti Sudiksha | 27 Jun 2026, 09:32 PM | నల్గొండ
సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కంచ‌ర్ల భూపాల్‌రెడ్డి బహిరంగ లేఖ

రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి రేపు నల్లగొండ ప‌ర్య‌ట‌న‌కు వస్తున్న నేపథ్యంలో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ న‌ల్ల‌గొండ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్ రెడ్డి బ‌హిరంగ లేఖ రాశారు. లేఖ సారంశం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు నల్లగొండకు రావడం ఆహ్వానించతగ్గ పరిణామమే. అయితే సీఎం తమ ప్రాంతానికి వస్తున్నారంటే సహజంగానే ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రజల్లో ఆకాంక్షలు, ఆశలు, కోరికలు ఉంటాయి. మీ రెండున్నర ఏండ్ల పాలన కాలంలో ఇది రెండోసారి మీరు నల్లగొండ పర్యటనకు రావడం. కానీ నేటికీ ఈ నల్లగొండ నియోజకవర్గ ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నవి అక్కడే ఉన్నాయి. ఇక్కడి నుండి ప్రాతినిద్యం వహిస్తున్న రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాల్లో తిరుగుతూ నల్లగొండ ప్రజలను గాలికి వదిలేశారు. నల్లగొండ నియోజకవర్గంలో రాష్ట్ర‌ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వేల కోట్ల అభివృద్ధి పనులను మంజూరు చేశారు. ఇందులో కొన్ని పూర్తి కాగా మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి.