Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

కుప్పకూలిన హెలికాప్టర్.

Author Neti Sudiksha | 28 Jun 2026, 08:27 PM | INTERNATIONAL
కుప్పకూలిన హెలికాప్టర్.

సౌదీ అరేబియాలోని రాస్ తనూరాలో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. సౌదీ ప్రెస్ ఎజెన్సీ తెలిపిన వివరాల మేరకు.. సౌదీ అరేబియాలోని ప్రముఖ ఆయిల్ కంపెనీ అరామ్‌కోకు చెందిన హెలికాప్టర్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల ప్రాంతంలో రాస్ తనూరా వద్ద కుప్పకూలింది. దీంతో హెలికాప్టర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

సహాయక చర్యలు మొదలెట్టారు. అయితే, ప్రమాదం కారణంగా అందులో ప్రయాణిస్తున్న 14 మంది చనిపోయారు. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ ధ్రువీకరించింది. చనిపోయిన వారంతా సౌదీకి చెందిన వారేనని తెలిపింది. హెలికాప్టర్ సాంకేతిక లోపం వల్ల కూలిందా? లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయం ఇంకా తెలియరాలేదు. మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. కాగా, యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా గత నాలుగు నెలలుగా నిలిచిపోయిన ముడి చమురు రవాణా లోడింగ్‌లను అరామ్‌కో సంస్థ తిరిగి ప్రారంభించిన రెండు రోజుల్లోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.