Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

కేప్ వెర్డే కెప్టెన్‌పై రేప్ ఆరోప‌ణ‌లు.

Author Neti Sudiksha | 29 Jun 2026, 12:41 PM | Sports
కేప్ వెర్డే కెప్టెన్‌పై రేప్ ఆరోప‌ణ‌లు.

ప్ర‌స్తుత ఫిఫా వ‌రల్డ్‌క‌ప్‌(FIFA World Cup)లో.. ఆఫ్రికా ద్వీప దేశం కేప్ వెర్డే సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ప్ర‌పంచ‌క‌ప్‌లో తొలిసారి ఎంట్రీ ఇచ్చిన ఆ దేశం.. ప్ర‌త్య‌ర్థుల‌కు షాక్ ఇస్తూ నాకౌట్ ద‌శ‌కు చేరుకున్న‌ది. అయితే ఆ జ‌ట్టు కెప్టెన్ ర్యాన్ మెండిస్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఓ బ్రెజిల్ మ‌హిళ‌పై అత‌ను అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్లు కేసు బుక్కైంది. ఆ కేసును న్యూజిలాండ్ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిసింది. ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం ప్రిపేర్ అవుతున్న స‌మ‌యంలో.. ఆక్లాండ్‌లో కేప్ వెర్డే ఓ మ్యాచ్ ఆడింది. ఆ స‌మ‌యంలో బ్రెజిల్ మ‌హిళ‌తో ప‌రిచ‌యం అయ్యింది.

వాస్త‌వానికి ఆమెను కేప్ వెర్డే జ‌ట్టుకు ఇంట‌ర్‌ప్రిట‌ర్‌గా కివీస్ ప్ర‌భుత్వం నియ‌మించింది. చిలీ దేశంతో మ్యాచ్ జ‌రిగిన త‌ర్వాత త‌న హోట‌ల్ రూమ్‌కు వెళ్లాల‌ని, ఆ టైంలో కేప్ వెర్డే కెప్టెన్ ర్యాన్ మెండిస్ అనుమ‌తి లేకుండానే రూమ్‌లోకి ఎంట‌ర్ అయ్యాడ‌ని, భౌతికంగా దాడి చేసి, అత్యాచారం చేసిన‌ట్లు ఆ మ‌హిళ ఆరోపించింది. వాంగ్మూలంతో పాటు గాయాల‌కు చెందిన ఫోటోల‌ను ఆమె కివీస్ పోలీసుల‌కు స‌మ‌ర్పించింది. ఆ ఘ‌ట‌న త‌ర్వాత ఫోరెన్సిక్ ప‌రీక్ష‌లు జ‌రిగాయి. ఆమెకు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు.

ఏప్రిల్‌లో న‌మోదు అయిన ఆ ఫిర్యాదుపై ఇంకా విచార‌ణ జ‌రుగుతున్న‌ట్లు కివీస్ పోలీసులు వెల్ల‌డించారు. ఆక్లాండ్ హోట‌ల్‌లో ఉన్న సీసీటీవీ ఫూటేజ్‌ను ప‌రిశీలించామ‌ని, కానీ అనుమానితుడిని ఎవ‌ర్నీ గుర్తుప‌ట్ట‌లేద‌న్నారు. ప్ర‌స్తుతం కేసు విచార‌ణ ద‌శ‌లో ఉంద‌ని, దీని వ‌ల్ల కెప్టెన్ మెండిస్‌ను నిర్దోషిగానే భావిస్తున్నామ‌ని, కానీ కోర్టులో ఈ కేసు విచార‌ణ‌కు రానున్న‌ట్లు కివీస్ పోలీసులు చెప్పారు.

ఇవి కూడా చదవండి