Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

రాణిస్తున్న బ్యాంకింగ్ షేర్లు.. స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు

Author Neti Sudiksha | 07 Jul 2026, 12:09 PM | BUSINESS
రాణిస్తున్న బ్యాంకింగ్ షేర్లు.. స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు

రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ సెక్టార్ భారీ లాభాలు ఆర్జించనుందనే అంచనాలు వెలువడిన నేపథ్యంలో ఆ రంగ సూచీలపై మదుపర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో బ్యాంకింగ్ రంగ షేర్లు లాభాలను ఆర్జిస్తున్నాయి. ఆ ప్రభావంతో దేశీయ సూచీలు కూడా స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. సోమవారం లాభాల నేపథ్యంలో గరిష్ఠాల వద్ద మదుప్లు అమ్మకాలకు మొగ్గుచూపుతుండడం కాస్త ప్రతికూలంగా మారింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 95.33గా ఉంది (Indian stock market).

గత సెషన్ ముగింపు (78,285)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 200 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కిందకు దిగి వచ్చింది. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 27 పాయింట్ల లాభంతో 78,312 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 12 పాయింట్ల లాభంతో 24,442 వద్ద కదలాడుతోంది (stock market news today).

ఇవి కూడా చదవండి


సెన్సెక్స్‌, నిఫ్టీలో జుబిలెంట్ ఫుడ్స్, స్విగ్గీ, టైటాన్ కంపెనీ, ఎల్‌టీఎమ్, ఆల్కెమ్ ల్యాబ్స్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ట్రెంట్, కల్యాణ్ జువెల్లర్స్, కొచిన్ షిప్‌యార్డ్, బీఎస్‌ఈ లిమిటెడ్, వెర్నోవా టీడీ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 207 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 200 పాయింట్ల నష్టంతో ఉంది.