Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

మీ నాన్నను ఎలా చంపేశారో.. మిమ్మల్ని అలాగే చంపేస్తా..

Author Neti Sudiksha | 11 Jul 2026, 12:01 PM | రంగారెడ్డి
 మీ నాన్నను ఎలా చంపేశారో.. మిమ్మల్ని అలాగే చంపేస్తా..

రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మీ నాన్నను ఎలా చంపేశారో.. మిమ్మల్ని కూడా అలాగే చంపేస్తానని పోక్సో బాధితురాలిని గతంలోనే రాజ్‌కుమార్‌ను బెదిరించినట్లు తెలిసింది. అయితే బాధితురాలు అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పుడే పోలీసులు కఠినంగా వ్యవహరించి ఉంటే ఇవాళ ఆరుగురి ప్రాణాలు పోయేవి కాదని బాధితురాలి కుటుంబసభ్యులు అంటున్నారు. కేవలం పోలీసుల నిర్లక్ష్యమే ఇంతటి దారుణానికి కారణమైందని ఆందోళన చేపట్టారు.
గతంలో భూతగాదాలో ఇద్దరిని బెదిరించినందుకు రాజ్‌కుమార్‌పై గతంలోనే రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు సమాచారం. ఇదిలా ఉంటే 2018లో సరిత అనే మహిళను రాజ్‌కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. అయినప్పటికీ మరో మైనర్ బాలికను ప్రేమ పేరుతో రాజ్‌కుమార్ వేధించసాగాడు. ఈ విషయం తెలిసిన బాలిక తల్లి ఆమెను కాలేజీకి పంపించకుండా ఇంట్లోనే ఉంచింది. ఈ క్రమంలో ఒకసారి పరీక్షల కోసం బాలిక కాలేజీకి వెళ్లినప్పుడు.. ఆమెను బలవంతంగా లాక్కెళ్లేందుకు యత్నించాడు. అప్పుడు ఆమె తల్లి చాకచక్యంగా వ్యవహరించి నిందితుడి నుంచి బాలికను తప్పించింది.
అప్పటి నుంచి బాలికపై రాజ్‌కుమార్ పలుమార్లు బెదిరింపులకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. మీ నాన్నను ఎలా చంపేశారో.. మిమ్మల్ని కూడా అలాగే చంపేస్తానని బాధితురాలి కుటుంబాన్ని గతంలో బెదిరించాడని అంటున్నారు. అయితే నిందితుడు బహిరంగంగా తిరుగుతూ బెదిరింపులకు పాల్పడుతున్నా.. పోక్సో కేసు నమోదైనప్పటికీ బాలికకు ఎలాంటి రక్షణ కల్పించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యమే ఈ ఉదందతానికి ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు.