Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

NEET-UG 2026 ఫలితాలలో వైబ్రంట్ అకాడమి విజయదుంధిభి

Author Neti Sudiksha | 17 Jul 2026, 09:55 PM | హన్మకొండ
NEET-UG 2026 ఫలితాలలో వైబ్రంట్ అకాడమి విజయదుంధిభి

హనుమకొండ జులై 17 (సుదీక్ష న్యూస్) :
నీట్ యూజీ-2026 ఫలితాలలో వైబ్రంట్ అకాడమి విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని వైబ్రంట్
అకాడమి డైరెక్టర్ సిహెచ్ రాజేంధర్ రెడ్డి తెలియజేశారు.ఈ సందర్భంగా అకాడమి డైరెక్టర్ సిహెచ్ రాజేందర్రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ పేద విద్యార్థుల కోసం కోటా రాజస్థాన్ వారి వైబ్రంట్ అకాడమిని
వరంగల్లో స్థాపించడం జరిగిందని తెలియజేస్తూ గురువారం రోజున విడుదల చేసిన NEET UG-2026
ఫలితాలలో వైబ్రంట్ అకాడమి విద్యార్థులు అత్యధికంగా ర్యాంకులు సాధించారని,ఇలాంటి ర్యాంకులు మొదటి బ్యాచ్లోనే సాధించడం చాలా సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు.వైబ్రంట్ అకాడమి మొదటి నుండి నీట్ మరియు జేఇఇ లలో అత్యుత్తమమైనటువంటి శిక్షణను వరంగల్లో అందించడం జరుగుతుందని గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులను సైతం
చక్కటి అకాడిమిక్ ప్రోగ్రామింగ్ మరియు ప్రణాళికల ద్వారా అద్భుతమైన అణిముత్యాలుగా తయారుచేసి జాతీయ స్థాయిలోనే ఉన్నతమైన ర్యాంకులు సాధించడం జరిగిందని తెలిపారు.అనంతరంనం జాతీయ స్థాయిలో ఉన్నతమైన ర్యాంకు AIR-143 బి.వినాయక్ HT.No.4205102271,12 మంది అత్యుత్తమైన ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు.
అనుభవజ్ఞులైన అధ్యాపకులతో నిరంతర పర్యవేక్షణ,యోగా మరియు మోటివేషన్తో మామూలు
విద్యార్థులను కూడా మెరికలు తిరిగిన విద్యార్థులుగా తీర్చి దిద్దడం జరుగుతుందని,ప్రతి విద్యార్థిపైన వ్యక్తిగతమైన శ్రద్ధ తీసుకోవడం వలనే ఈ ఫలితాలు సాధించారని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైబ్రంట్ అకాడమి ప్రిన్సిపాల్ టి. శేషుకుమార్,అడ్మినిస్ట్రేషన్ హెడ్ జి. రఘుపతి,కోఆర్డినేటర్ రామ్ గుమ్మడి,అధ్యాపక బృందం మరియు బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.